హాలియా (నాగార్జునసాగర్) : రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ కోరారు. మంగళవారం స్థానిక లచ్చిరాంనాయక్ కాంప్లెక్స్‌లో పంఘం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘం గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుందని విద్యా, ఉద్యోగాల్లో రావల్సిన వాటాపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అనంతరం హాలియా మార్కెట్ చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రవినాయక్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ధనావత్ ధన్‌సింగ్‌నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాణావత్ బాబూరావ్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆంగోతు భగవాన్‌నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షానాయక్, ధీరావత్ స్కైలాబ్‌నాయక్, హేమ్లానాయక్, స్వచ్ఛభారత్ పురస్కార అవార్డు గ్రహీత వడిత్యా వెంకట్రాంనాయక్, పాండునాయక్, బాలునాయక్, సైదానాయక్, నాగేందర్‌నాయక్, జవహర్‌నాయక్, దీప్లానాయక్ పాల్గొన్నారు.
సమస్యలపై పార్టీలకతీతంగా పోరాడాలి
Oct 25 2017 3:15 PM | Updated on Oct 25 2017 3:15 PM
Advertisement


