ఫిబ్రవరి 11 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు

Feb 11th Onwards Pre Final Exams For tenth Class - Sakshi

మిగతా తరగతులకు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే మార్చి 19వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆర్జేడీఈలను, డీఈవోలను ఆదేశించింది. నిర్ణీత తేదీల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాలని పేర్కొంటూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 24, 25 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏప్రిల్‌ 7 నుంచి 16వ తేదీ వరకు వార్షిక పరీక్షలను (ఎస్‌ఏ–2) నిర్వహించాలని తెలిపింది.

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6, 7 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు, 8వ తరగతి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు, 9వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పేపర్‌–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పేపర్‌–2 పరీక్షలు నిర్వహించాలని వెల్లడించింది. ఏప్రిల్‌ 18వ తేదీన ఫలితాలను ప్రకటించి, విద్యార్థులకు జవాబు పత్రాలను అందజేయాలని, 20వ తేదీన పేరెంట్‌ టీచర్‌ సమావేశం నిర్వహించాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top