ఆదర్శ రైతులను నిలదీసిన రైతులు | farmers question to model farmers | Sakshi
Sakshi News home page

ఆదర్శ రైతులను నిలదీసిన రైతులు

Sep 30 2014 11:46 PM | Updated on Sep 2 2017 2:11 PM

మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఆదర్శరైతులు...

సిద్దిపేట రూరల్ : మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఆదర్శరైతులు వినియోగించుకున్నారని ఆరోపిస్తూ మూడు రోజులుగా మండలంలో ని తోర్నాల గ్రామ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. విషయం తెలుసుకున్న వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, ఏఈఓ హనుమంతరెడ్డి లు కలిసి గ్రామ పంచాయతీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ఆదర్శ రైతులు రిక్కల రాజిరెడ్డి, గడ్డం రాజులను అధికారులు పిలిపించారు. వారు రాగానే రైతులు మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ లెక్కలు చూపాలని ఆదర్శ రైతులను నిలదీశారు. దీంతో ఆదర్శ రైతు రాజిరెడ్డి వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ప్రసన్న కుమార్, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌లు సిబ్బందితో గ్రామానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు.

 ఈ సందర్భంగా ఆదర్శ రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొక్కజొన్న పంట ఇన్సూరెన్స్‌కు సంబంధిం చిన రైతుల పేర్ల రికార్డు పోయిందన్నారు. రైతులు కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంక్‌లో తక్కువ కట్టినట్లు రాజిరెడ్డి ఒప్పుకున్నారు. రికార్డు బుధవారం సాయంత్రంలోగా గ్రామ పంచాయతీలో అ ప్పగిస్తానని, తరువాత పంచాయతీ వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. పంట నష్టపోతే ప్రభుత్వం ఎంత ఇన్సూరెన్స్ చెల్లిస్తుందో ఆదర్శరైతులు కూడా తమకు అంతే మొత్తం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.

ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతుల వాదనకు కట్టుబడి ఆదర్శరైతులు ఉండాలని లేని పక్షంలో వారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ ఏఓ మాట్లాడుతూ గ్రామంలో 373 మం ది రైతులు మొక్కజొన్న పంటకు ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లు, బ్యాంక్‌లో రూ. 1.30 లక్షలు బ్యాంక్‌లో డీడీల రూపంలో చెల్లించినట్లు జాబితాలో ఉందన్నారు. సమావేశంలో సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement