మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యానికి వెంటనే కాంటా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రైతులు నిరసకు దిగారు.
మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యానికి వెంటనే కాంటా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రైతులు నిరసకు దిగారు. కాంటా కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మార్కెట్ యార్డులో హమాలీలు సోమవారం ఉదయం నుంచి కాంటా నిలిపివేశారు. దీంతో మధ్యాహ్నం వరకు వేచి చూసిన రైతుల్లో సహనం నశించింది. అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని, కాంటాలు ప్రారంభించి కార్యకలాపాలను వెంటనే మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సాయంత్రం 3 గంటల నుంచి రైతులంతా కలసి జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. ఆందోళన కొనసాగుతోంది.