ఏ పంట వేయాలో చెప్పేస్తుంది...

Farmers Kids Win Indias Largest Artificial Intelligence - Sakshi

వారంతా రైతు బిడ్డలు. చిన్నప్పట్నుంచీ తాము తిరిగిన ఊరు, పంట పొలాలు, అక్కడ మట్టి పరిమళాలు గురించి మాత్రమే తెలుసు. అయితేనేం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగించుకోవడంలో తమకు ఎవరూ సాటి పోటీ లేదని నిరూపించుకున్నారు. చిన్నప్పట్నుంచీ భూమినే నమ్ముకున్న బతుకులైనా దానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం జోడించారు. వాన రాకడల్ని, వాతావరణంలో మార్పుల్ని, పంటలపై వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఒక యాప్‌ని రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా మట్టిలో నాణ్యత ఎంత?, అది ఏ పంటలకు అనుకూలం? వంటివన్నీ ఆ యాప్‌ కచ్చితమైన అంచనాలతో చెప్పేస్తుంది. భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో అత్యంత మారుమూల గ్రామాలకు చెందిన వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఈ యాప్‌ను రూపొందించింది. పుణేకి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఐసెర్టిస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా చేసే సరికొత్త ఆవిష్కరణలకు ఇచ్చే ప్రైజ్‌ వీరి యాప్‌కు లభించింది. సాఫ్ట్‌వేర్‌ కార్యక్రమాలకు సంబంధించిన హాక్‌థాన్‌ అనే వేదికలో వీరంతా చేరి తమ మేధకు పదునుపెట్టారు. హాక్‌థాన్‌ విసిరే సవాళ్లలో టీమ్‌ వర్క్, ఏఐ వినియోగం, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వంటివన్నీ విస్తృతంగా అధ్యయనం చేస్తారు. మొత్తం 12 మంది రైతు బిడ్డలంతా కలిసి ఈ యాప్‌ని రూపొందించి ప్రైజు కొట్టేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top