అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide in adilabad distirict | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jan 21 2016 1:04 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అదిలాబాద్ జిల్లా భిమిని మండలం తాళ్లరెడ్డెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

భిమిని: అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అదిలాబాద్ జిల్లా భిమిని మండలం తాళ్లరెడ్డెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య(36)కు వ్యవసాయంలో దిగుబడి సరిగాలేదు. ఈ నేపధ్యంలో గత రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక పోవడంతో.. అప్పులు పెరిగిపోయాయి. దీంతో వాటిని తీర్చే దారికానరాక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement