సాగు చేసిన వరిపంటకు సరిపోను నీరు లేకపోవటం, బోరు వేయిద్దామన్నా వీలుకాకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యాలాల (రంగారెడ్డి) : సాగు చేసిన వరిపంటకు సరిపోను నీరు లేకపోవటం, బోరు వేయిద్దామన్నా వీలుకాకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండంలోని నాగసముందర్ గ్రామానికి చెందిన తోకల రుస్తుమప్ప(55)కు ఐదెకరాల పొలం ఉంది.
ఈ ఏడాది నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. పొట్ట దశలో ఉన్న పైరుకు బోరు నీరు సరిపోవటం లేదు. దీంతో రుస్తుమప్ప మరో బోరు వేయించాలని ప్రయత్నించాడు. కానీ బోరు బండి పొలంలోకి ప్రవేశించే వీలులేకపోయింది. తీవ్ర ఆందోళన చెందిన రైతు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.