రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మెయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనిల్‌కుమార్ (35) అనే రైతు నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. సాగు కోసం ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు.
కాగా అవి తీర్చాలంటూ ఒత్తిళ్లు రావడం, అదే సమయంలో సాగు కోసం మరింత వెచ్చించాల్సిన పరిస్థితులతో మనస్తాపం చెంది సోమవారం రాత్రి పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.