ఓ వడ్డీ వ్యాపారి వేధింపులకు గిరిజన రైతు బలయ్యాడు.
మహబూబ్‌నగర్ (పాన్‌గల్) : ఓ వడ్డీ వ్యాపారి వేధింపులకు గిరిజన రైతు బలయ్యాడు. ఈ సంఘటన గురువారం మహబూబ్నగర్ జిల్లా పాన్‌గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి తండాలో జరిగింది. తండాకు చెందిన రైతు మూడవత్ లాల్య(58) భూమి కొనుగోలు కోసం అదే తండాకు చెందిన వడ్డీ వ్యాపారి శివుడి వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు.
కాగా ఇటీవల రూ.50వేలు తిరాగివ్వగా.. వాటిని వడ్డీ కింద జమచేసుకున్నాడు ఆ వ్యాపారి. అసలు చెల్లించాలని శివుడు కొన్ని రోజులుగా అందరిముందు అవమానకరంగా మాట్లాడుతుండటంతో మనస్తాపానికి గురైన రైతు బుధవారం రాత్రి ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.