ఎన్నికల బరిలో భార్యా భర్తలు..

సాక్షి, కొత్తకోట: మున్సిపల్ ఎన్నికల బరిలో ఇద్దరు భార్యాభర్తలు బరిలో నిలిచారు. ఒక జంటలో భర్త శ్రీనివాసులు ఏడో వార్డు నుంచి పోటీ చేస్తుండగా, భార్య మాజీ సర్పంచ్ అయినటువంటి అరుణ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారంతో పోటీపడుతున్నారు. ప్రస్తుతం అరుణ పోటీ చేస్తున్న 9వ వార్డులో టీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి సుఖేశిని పోటీలో ఉన్నారు.
అలాగే మరో జంట అయినటుంటి వారిలో నాగన్న 8వ వార్డు నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పద్మజ 12వ వార్డు నుంచి పోటీ చేస్తుంది. వీరిద్దరు సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫారంతో బరిలో నిలిచారు. కాగా నాగన్న గతంలో 13 వార్డుసభ్యుడిగా పనిచేయగా, పద్మజ గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరిరువురికి రాజకీయంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి