అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు | Everyone who is eligible for Welfare schemes | Sakshi
Sakshi News home page

అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

Oct 17 2014 1:37 AM | Updated on Mar 28 2018 11:05 AM

అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు - Sakshi

అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావ్ అన్నారు.

రాష్ట్ర మంత్రి హరీష్‌రావు
మర్పల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావ్ అన్నారు. ఈనెల 20లోనే పథకాల దరఖాస్తుకు గడువు తీరిపోతోందని భయపడవద్దన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధికి దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. గురువారం మండల పరిధిలోని బిల్‌కల్‌లో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ తండ్రి మాణయ్య (80) మృతి చెందారు. బిల్‌కల్‌లోని విఠల్ స్వగృహంలో నిర్వహించిన మాణయ్య దశ దిన కర్మ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి హరీష్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేనిపోని అపోహాలు సృష్టిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా ఉండేందుకే ప్రజల నుంచి మరోసారి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెల్ల రేషన్‌కార్డులో వ్యక్తికి 4 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారని, తాము దాన్ని 6 కిలోలకు పెంచడానికి సిద్ధంగా ఉ న్నట్లు చెప్పారు. రైతు రుణాలకు సంబంధించి ఇప్ప టికే 25 శాతం నిధులను బ్యాంకుల్లో జమచేశామన్నారు.

హాజరైన పలువురు ప్రముఖులు
తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ తండ్రి మాణయ్య దశ దిన ఖర్మకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్, టీఎన్‌జీఓల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, గెజిటేడ్ ఉద్యోగులు సంఘం సభ్యులు సత్యనారాయణ, మధుసూదన్, తెలంగాణ సంక్షేమ వసతి గృహాల చైర్మన్ మల్లయ్య, జిల్లా నాయకులు తుల్జారాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement