బార్బెక్యూ... ఉయ్ లైక్యూ | Everybody like very much about Barbecue Cooking Style | Sakshi
Sakshi News home page

బార్బెక్యూ... ఉయ్ లైక్యూ

Jul 16 2014 2:37 AM | Updated on Sep 2 2017 10:20 AM

బార్బెక్యూ... ఉయ్ లైక్యూ

బార్బెక్యూ... ఉయ్ లైక్యూ

మనిషెంత ఎత్తుకు ఎదిగినా మూలాలెక్కడికీ పోవనడానికో ప్రత్యక్ష ఉదాహరణ బార్బెక్యూ. ఆదిమ మానవుడు నిప్పులపై కాల్చుకుని తిన్నాడు.

WESTERN Style Cooking
మనిషెంత ఎత్తుకు ఎదిగినా మూలాలెక్కడికీ పోవనడానికో ప్రత్యక్ష ఉదాహరణ బార్బెక్యూ. ఆదిమ మానవుడు నిప్పులపై కాల్చుకుని తిన్నాడు. ఇప్పుడా నిప్పులపై చువ్వలు పేర్చి వాటిపై ఆహారం ఉడికించి మోడరన్‌గా తింటున్నాం. అక్కడా ఇక్కడా ఆహారాన్ని ఇష్టంగా తినేలా చేసింది స్మోకీ టేస్ట్.
 
 బార్బెక్యూ కుకింగ్ స్టైల్‌పై సిటిజనులకు ఆసక్తి పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అత్యంత ఆదరణ పొందిన ఈ కుకింగ్ స్టైల్ ప్రత్యేకత నిదానంగా వండడం. వేడిని ఎక్కువసేపు నిల్వ ఉంచడం. బార్బెక్యూ శైలిలో నిప్పుసెగ ప్రత్యక్షంగా వండే పదార్థాన్ని తాకకుండా, గాఢమైన పొగ ప్రభావం తగిలేలా వండుతారు. దీని వల్ల ఆహార పదార్థాలకు ఓ వినూత్నమైన స్మోకీ టేస్ట్ అంటుతుంది. ఆ స్మోకీ టేస్టే బార్బెక్యూని ప్రపంచవ్యాప్తంగా ఫుడ్‌లవర్స్‌కి సన్నిహితం చేసింది.
 
 రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ రోడ్‌నం.2 సినీమాక్స్‌లోని యూనిక్ బార్బెక్యూలో ఫుడ్‌తోపాటు బార్ వాతావరణాన్ని కూడా మార్చేశారు నిర్వాహకులు. బఫేలో మెయిన్ డిషెస్‌తోపాటు స్టార్టర్స్, సూప్స్, సలాడ్స్, మాక్‌టెయిల్స్, డెసర్ట్స్, హైదరాబాదీ స్పెషల్స్ పాయా, హలీమ్ కూడా అందిస్తున్నారు. హంగేరీ ముర్గీ చికెన్, మటన్ గలీఫ్ సిక్ కబాబ్ వంటి స్పైసీ  డిషెస్, షాయితుక్‌డా, డబుల్‌కామీటా, కద్దూ కీ ఖీర్, తదితర డెసెర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. బుధవారం వరకూ ఫుడ్ ఫెస్ట్ కొనసాగుతుంది.
 - సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement