breaking news
Barbecue
-
హనీమూన్‌లో ఊహించని ప్రమాదం
సరదాగా గడుపుదామని వెళ్లిన నవ దంపతులకు చేదు అనుభవం అనుభవం ఎదురైంది. క్షణాల్లోనే మంటల్లో చిక్కుకున్న భార్యను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.పెళ్లయి రెండు నెలలే.. కొత్త జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించేందుకు భార్యాభర్తలు విహారయాత్రకు వెళ్లారు. ప్రకృతి అందాల మధ్య సరదాగా గడుపుతూ బార్బెక్యూ చేసుకుంటున్నారు. అంతలోనే ఓ వ్యక్తి చేసిన పని ఊహించని ప్రమాదానికి దారితీసింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు నవ వధువు నిఖితా దాస్‌ను చుట్టుముట్టాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆమె అగ్నికీలల్లో చిక్కుకుంది. కళ్లముందే భార్య మంటల్లో కాలిపోతుండటంతో భర్త సమీర్ ఆమెను కాపాడేందుకు పరుగులు తీశాడు. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లా సిటాంగ్లో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.బార్బెక్యూ దగ్గర ఏం జరిగింది?చోప్రాకు చెందిన సమీర్ దాస్, తన భార్య నిఖితతో కలిసి విహారయాత్ర కోసం సిటాంగ్‌కు వెళ్లారు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. అక్కడి ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేస్తున్న ఈ జంట.. బార్బెక్యూ సెషన్లో పాల్గొంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. దంపతులు బార్బెక్యూ దగ్గర కూర్చుని ఉండగా, ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి లేచి వచ్చి క్యాన్‌లోని ద్రవాన్ని మంటలపై పోసినట్లు కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి నిఖిత వైపు దూసుకెళ్లాయి.భార్యను కాపాడేందుకు భర్త పరుగులుమంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో నిఖిత అగ్నికీలల్లో చిక్కుకుని కిందపడిపోయింది. వెంటనే స్పందించిన సమీర్.. భార్యను రక్షించేందుకు పరుగెత్తాడు. ద్రవాన్ని పోసిన వ్యక్తి కూడా తన టీ షర్టును విప్పి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీలో కనిపిస్తోంది. ఈ ఘటనతో రిసార్ట్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సిబ్బంది, అక్కడున్న ఇతరులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం నిఖితను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిఖిత ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.हनीमून पर गए कपल को बारबेक्यू का शौक पड़ा भारी, आग की चपेट में आने से दुल्हन 60% झुलसी#Westbengal pic.twitter.com/Ww5VpWljeJ— Mangal Yadav (@MangalyYadav) September 17, 2026రిసార్టుల్లో భద్రతపై ప్రశ్నలుబార్బెక్యూ నిర్వహణలో మండే స్వభావం ఉన్న ద్రవాలను బహిరంగ మంటల సమీపంలో ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. రిసార్టుల్లో అగ్నిమాపక పరికరాలు, సురక్షిత ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన అవసరంపై చర్చ మొదలైంది.ఇదీ చదవండి: నర్సుపై ఘాతుకం.. -
రూ.1.4 కోట్ల బిల్లు కస్టమర్లకు వాపస్!
వ్యాపారంలో లాభాల కంటే వినియోగదారుల నమ్మకమే ముఖ్యమని బార్బెక్యూ రెస్టారెంట్ తెలిపింది. తాము అందించిన ఆహారం సొంత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గ్రహించిన సదరు యాజమాన్యం.. ఏకంగా కస్టమర్లకు సుమారు రూ.1.4 కోట్లు (1,62,000 అమెరికన్ డాలర్లు / 1.1 మిలియన్ యువాన్లు) తిరిగి చెల్లించింది. కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా సంస్థే స్వయంగా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుంది. ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. చైనావ్యాప్తంగా 142 అవుట్లెట్లతో విస్తరించిన ప్రసిద్ధ బ్రాండ్ ‘వెరీ లాంగ్ అగో లాంబ్ స్కేవర్స్’ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.అసలేం జరిగింది? గ్రిల్లింగ్లో లోపమే కారణమా?ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీకి చెందిన 24 అవుట్లెట్లలో దాదాపు 48,000 టేబుల్స్ వద్ద భోజనం చేసిన కస్టమర్లను రెస్టారెంట్ యాజమాన్యం ఈ నెల ప్రారంభంలో స్వయంగా సంప్రదించింది. అంతర్గత నాణ్యత సమీక్షలో ఒక షాకింగ్ నిజం బయటపడటమే దీనికి కారణం. ఆ సమయంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రిల్లింగ్ పరికరాల్లో ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడం వల్ల, మటన్ కబాబ్‌లు ఆశించిన స్థాయిలో గ్రిల్ కాలేదని కంపెనీ గుర్తించింది. కస్టమర్ల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు రానప్పటికీ తమ బ్రాండ్ విలువలకు కట్టుబడి సదరు మటన్ స్కేవర్ల ధరలో 50 శాతం మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్ చేసింది.నిజాయితీయా? మార్కెటింగ్ జిమ్మిక్కా?ఈ భారీ వాపసు కార్యక్రమం నెట్టింట వైరల్‌గా మారడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘లాభాల కంటే కస్టమర్ల సంతృప్తికే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన రెస్టారెంట్ నిజాయితీ అమోఘం’ అని మెజారిటీ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసిన ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
బార్బెక్యూ... ఉయ్ లైక్యూ
WESTERN Style Cooking మనిషెంత ఎత్తుకు ఎదిగినా మూలాలెక్కడికీ పోవనడానికో ప్రత్యక్ష ఉదాహరణ బార్బెక్యూ. ఆదిమ మానవుడు నిప్పులపై కాల్చుకుని తిన్నాడు. ఇప్పుడా నిప్పులపై చువ్వలు పేర్చి వాటిపై ఆహారం ఉడికించి మోడరన్‌గా తింటున్నాం. అక్కడా ఇక్కడా ఆహారాన్ని ఇష్టంగా తినేలా చేసింది స్మోకీ టేస్ట్. బార్బెక్యూ కుకింగ్ స్టైల్‌పై సిటిజనులకు ఆసక్తి పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అత్యంత ఆదరణ పొందిన ఈ కుకింగ్ స్టైల్ ప్రత్యేకత నిదానంగా వండడం. వేడిని ఎక్కువసేపు నిల్వ ఉంచడం. బార్బెక్యూ శైలిలో నిప్పుసెగ ప్రత్యక్షంగా వండే పదార్థాన్ని తాకకుండా, గాఢమైన పొగ ప్రభావం తగిలేలా వండుతారు. దీని వల్ల ఆహార పదార్థాలకు ఓ వినూత్నమైన స్మోకీ టేస్ట్ అంటుతుంది. ఆ స్మోకీ టేస్టే బార్బెక్యూని ప్రపంచవ్యాప్తంగా ఫుడ్లవర్స్కి సన్నిహితం చేసింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ రోడ్‌నం.2 సినీమాక్స్లోని యూనిక్ బార్బెక్యూలో ఫుడ్‌తోపాటు బార్ వాతావరణాన్ని కూడా మార్చేశారు నిర్వాహకులు. బఫేలో మెయిన్ డిషెస్తోపాటు స్టార్టర్స్, సూప్స్, సలాడ్స్, మాక్టెయిల్స్, డెసర్ట్స్, హైదరాబాదీ స్పెషల్స్ పాయా, హలీమ్ కూడా అందిస్తున్నారు. హంగేరీ ముర్గీ చికెన్, మటన్ గలీఫ్ సిక్ కబాబ్ వంటి స్పైసీ డిషెస్, షాయితుక్డా, డబుల్‌కామీటా, కద్దూ కీ ఖీర్, తదితర డెసెర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. బుధవారం వరకూ ఫుడ్ ఫెస్ట్ కొనసాగుతుంది. - సాక్షి, సిటీప్లస్


