
సిటీ సెంటర్ లో పోకిరీకి దేహశుద్ధి
రాజధానిలో ఈవ్ టీజర్లు రెచ్చిపోతున్నారు. వెకిలి చేష్టలతే వనితలను వేధిస్తున్నారు.
హైదరాబాద్: రాజధానిలో ఈవ్ టీజర్లు రెచ్చిపోతున్నారు. వెకిలి చేష్టలతే వనితలను వేధిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ సిటీ సెంటర్ లో శుక్రవారం పోకిరీలు రెచ్చిపోయారు. ఇద్దరు యువతులను వేధింపులకు గురిచేశారు. దీంతో కలత చెందిన యువతులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ లో సమాచారం అందించారు.
వెంటనే సిటీ సెంటర్ కు చేరుకున్న యువతి బంధువులు పోకిరీలకు బుద్ధి చెప్పేందుకు యత్నింగా వారు ఎదురు తిరిగారు. దీంతో ఒకరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు పారిపోయారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళలపై వేధింపులు ఆగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.