అభయారణ్యంలో 64 నీటితొట్ల ఏర్పాటు

Establishment of 64 water reservoirs in the forrest - Sakshi

పాల్వంచరూరల్‌: వేసవిలో అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి సౌకర్యం కోసం రూ.2.24లక్షల వ్యయంతో నీటి తోట్లను ఏర్పాటు చేసినట్లు ఎఫ్‌డీఓ ఎం.నాగభూషణం తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిన్నెరసాని అభయారణ్యంలోని యానంబైల్, చాతకొండ, అళ్లపల్లి, కరగూడెం రేంజ్‌ పరిధిలోని 74 బీట్లలో నీటి సౌకర్యంలేని ప్రాంతాలను గుర్తించి 64 నీటి తోట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో నీటితొట్టికి రూ.3500ను ఖర్చు చేసినట్లు వివరించారు.

వాటిని ఒక ఫీట్‌ఎత్తులో నిర్మించి ఎప్పటికీ తొట్లలో నీరు ఉండే లా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అళ్లపల్లి ఏరియాలో సోలార్‌ పంప్‌సెట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.4లక్షల వ్య యంతో అటవీలో నిప్పు అంటుకోకుండా ముందస్తుగా ఫైర్‌లైన్స్‌ ఏర్పా టు చేసినట్లు చెప్పారు. 54 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫైర్‌లైన్స్‌ ఉంటాయన్నారు. ఎవరైనా అటవీలో నిప్పు పెడితే వారిపై చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీగుండా ప్రయాణించే వారు.. గొర్రెలు, మేకలు, పశువుల కాపర్లు అగ్గిపెట్ట లేదా లైటర్‌తో తిరుగొద్దన్నారు. 
 

Advertisement
Advertisement
Back to Top