రిటైర్మెంట్‌ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి గవర్నర్‌  | ESL Narasimhan Will Join In TRS Says Gudur Narayana Reddy | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి గవర్నర్‌ 

Jan 28 2019 2:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

ESL Narasimhan Will Join In TRS Says Gudur Narayana Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆ విషయం మరిచి టీఆర్‌ఎస్‌ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేళ ఆయన చేసిన ప్రసంగం గవర్నర్‌గా రిటైర్మెంట్‌ అయ్యా క టీఆర్‌ఎస్‌లో చేరేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గవర్నర్‌ ప్రశంసించవచ్చు, కానీ నరసింహన్‌ మాత్రం కేసీఆర్, ఆయ న పార్టీని పొగిడేందుకే ఎక్కువ ఉత్సా హం చూపారన్నారు.

గవర్నర్‌ ప్రసంగం పరమ చెత్తగా ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో గవర్నర్‌గా పదవీ కాలం ముగియనుండటంతో అది పొడిగించుకునేందుకే ఆయన వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందన్నారు. తాను ప్రాతినిథ్యం వహించేది రాజ్‌భవన్‌కు అని, టీఆర్‌ఎస్‌కు కాదని గవర్నర్‌ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement