‘ప్రత్యేక కోర్టులకోసం సీఎంతో మాట్లాడతా’ | Errolla Srinivas Demand For Special Court | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక కోర్టులకోసం సీఎంతో మాట్లాడతా’

Jun 6 2018 3:11 AM | Updated on Sep 15 2018 3:01 PM

Errolla Srinivas Demand For Special Court - Sakshi

ఎర్రోళ్ల శ్రీనివాస్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడుల్లో సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. తన ఆఫీస్‌ నుంచి లేఖలు రాసినా కేసులను ముందుకు తీసుకెళ్లలేదన్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ గత 10 సంవత్సరాలుగా చేయని ఎన్నో పనులు ఈ మూడు నెలలుగా తాము చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement