గుట్టను తవ్వి దర్జాగా దందా

ERRA MATTI ILLEGAL EXCAVATIONS IN MAHABUBNAGAR - Sakshi

ఎర్రమట్టి స్వాహా..! 

పచ్చని చెట్లు నేలపాలు  

జోరుగా సాగుతున్న ఇటుక వ్యాపారం

డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు అసాధ్యాలను సైతం సుసాధ్యాలుగా మార్చుకుంటున్నారు.. పర్యావరణానికి పెను ప్రమాదం అని తెలిసినా పచ్చని చెట్లను నేలమట్టం చేస్తున్నారు.. ఎర్రగుట్టను తవ్వేసి దర్జాగా దందా సాగిస్తున్నారు. ఇంతజరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

ధన్వాడ : అనుమతులు లేకుండా గుట్టను తవ్వి కొందరు దందా చేస్తున్నారు. మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ధన్వాడ మండల కేంద్రనికి రెండు కిలోమీటర్ల దూరంలో భారత గట్లు నుంచి గత కొంత కాలంగా జేసీబీలతో తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇది తమ పట్టా భూమి అంటూ ఇటుక బట్టీలను పెట్టుకొని వాడుకుంటున్నారు. 

బోర్డు ఏర్పాటుచేసినా..  
ఆ స్థలంలో ఫారెస్ట్‌ ఏరియాను సూచించే బోర్డును అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినా అవేవీ పట్టించుకోకుండా తవ్వకాలు జరిపారు. అంతే కాకుండా పచ్చని చేట్లను నరికేస్తున్నారు. మట్టిని భూమి సమాంతరంగా తవ్వి వాటిని తమ పొలంలోకి కలిపేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటు ఫారెస్ట్‌ శాఖ అధికారులుగాని, ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.  

దర్జాగా ఇటుక దందా..  
ఎక్కడి నుంచో ఇటుకకోసం మట్టిని తె చ్చుకుంటూ వాటికి డబ్బులు ఎందుకు ఖర్చు పెటలనుకున్నారో ఏమో ఏకంగా గుట్ట దగ్గరే మకాం పెట్టేశారు. ఇటుక బ ట్టీ యజమనులు వ్యాపారం మూడు పు వ్వులు ఆరు కాయలుగా ఉంది. ఒక ఇ టుకకు రూ.5 నుంచి రూ.15వరకు అ మ్ముతున్నారు. అంటే వేయ్యి ఇటుకలకు రూ.5వేలు పలుకుతుంది. మండలంలో దాదాపు నాలుగు ఇటుక బట్టీలు ఏర్పా టు చేసుకున్నారు. వీటికి ఎక్కడా అనుమతులు తీసుకోవడంలేదు. ప్రధాన రా హదారులకు పక్కనే ఉన్నా అధికారులు అటునుంచే రాకపోకలు చేస్తున్నారు.   

ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు 
మండలంలో ఎక్కడా ఎర్రమట్టి కావాల్సినా భారత గుట్టనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. ఒక్క ట్రాక్టర్‌ ట్రీప్‌కు రూ.400 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. పొలాలకు వేళ్లే రాహదారిని తవ్వడంతో బాటలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

పరిశీలిస్తాం

ఈ వ్యవహారం మా దృష్టికి రాలేదు. అధికారులను పంపించి వివరాలు సేకరిస్తాం. ఎవరైన హద్దులు దాటి అటవీప్రాంతం మట్టిని తరలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.  
– గంగారెడ్డి,  జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్‌ఓ)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top