రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్‌ ఉద్యోగులు  | Electricity Employees Fires Over Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్‌ ఉద్యోగులు 

Aug 31 2019 3:27 AM | Updated on Aug 31 2019 3:27 AM

Electricity Employees Fires Over Revanth Reddy - Sakshi

ర్యాలీలో పాల్గొన్న విద్యుత్‌ ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును గన్‌పార్క్‌ వద్ద బహిరంగంగా కాల్చిచంపినా తప్పులేదన్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఎంపీ వాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ నుంచి గన్‌పార్క్‌ వరకు భారీ ర్యాలీ జరిపారు. అనంతరం మింట్‌కాంపౌండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని వారంతా మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. నిజాయితీ పరుడైన ట్రాన్స్‌కో సీఎండీ ని కాల్చిచంపాలని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. తన వాఖ్యలను ఉపసంహరించుకుని, సీఎండీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ రేవంత్‌ విద్యుత్‌ సంస్థలపై అడ్డగోలు ఆరోపణలు చేసి, వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్ర మంలో పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్స్‌ సంఘాలతోపాటు 2వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement