నేరాల నియంత్రణకు కృషి | effort to crime control : gangadhar | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు కృషి

Nov 25 2014 2:59 AM | Updated on Oct 17 2018 6:06 PM

నేరాల నియంత్రణకు కృషి చేయనున్నట్లు నిజామాబాద్ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీ వై.గంగాధర్ తెలిపారు.

నిజామాబాద్ అర్బన్ : నేరాల నియంత్రణకు కృషి చేయనున్నట్లు నిజామాబాద్ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీ వై.గంగాధర్ తెలిపా రు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తులను పూర్తిచేయాలని, అనంత రం చర్యలు తీసుకునే విధంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణ చేపడితేనే కొత్త రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

అంతేకాకుండా పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా విధు లు నిర్వహించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికి సరైన న్యాయం చేకూర్చాలన్నారు. తాను సొంత జిల్లా వాడినైనందున ఎవరైనా తన పేరు చెప్పుకొని వస్తే సాధారణంగానే స్పందించాలన్నారు. చైన్‌స్నాచర్‌లకు సంబంధించి నివారణ చర్యలు చేపడుతున్నామని, ముఖ్యమైన పట్టణాల్లో ఈ సమస్య ఉందన్నారు. జాతీయ రహదారి వెంబడి నేరాల అదుపునకు కృషి చేస్తున్నామన్నారు.

ప్రత్యేకంగా పెట్రోలింగ్ బృందాల ను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను నివారిస్తామన్నారు. దీనికి మహిళా పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాపా ర సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, మాల్స్, రద్దీ గల వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చే సుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడం మున్సిపాలిటీతో సమన్వయ లోపమే కారణమన్నారు. సమావేశంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement