బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం.. | eetela rajendhar slams on t tdp leaders | Sakshi
Sakshi News home page

బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం..

Apr 16 2015 3:03 PM | Updated on Jul 11 2019 5:33 PM

బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం.. - Sakshi

బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం..

డబ్బు సంచులకోసమే ఆంధ్రోళ్లకు మోకరిల్లినట్లయితే రూపాయి రూపాయి బిచ్చమెత్తుకోనైనా డబ్బులిస్తాం..

మహబూబ్‌నగర్ : డబ్బు సంచులకోసమే ఆంధ్రోళ్లకు మోకరిల్లినట్లయితే రూపాయి రూపాయి బిచ్చమెత్తుకోనైనా డబ్బులిస్తాం..వారి మాయనుంచి బయటకు రావాలని తెలంగాణ టీడీపీ నాయకులను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. గురువారం జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ చెరువులో మిషన్‌కాకతీయ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పాలమూరు జిల్లాను లేబర్‌జిల్లాగా మార్చిన ఘనత టీడీపీదే నని విమర్శించారు. అరవయ్యేళ్ల ఇతరుల పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని, దాని నుంచి కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం మిషన్‌కాకతీయ టెండరు ప్రక్రియలో ఎలాంటి రాజకీయం లేకుండా చేసిందని వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
(జడ్చర్ల టౌన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement