4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన | ECet certificates verification from july 4 | Sakshi
Sakshi News home page

4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన

Published Sun, Jun 28 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్)-2015 ర్యాంకర్లకు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్)-2015 ర్యాంకర్లకు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 10 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ర్యాంకులను బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవచ్చు.

వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు హైదరాబాద్ (మాసబ్‌ట్యాంక్)లోని సాంకేతిక విద్యాభవన్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అర్హత పరీక్షలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులు 40% మార్కులు పొంది ఉండాలి. వివరాలకు https://tsecet.nic.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వచ్చే నెల 5 నుంచి 8వ తేదీలోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 10వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
 
 ధ్రువపత్రాల పరిశీలన ఇలా..
  4వ తేదీన ఉదయం 9కి 1 నుంచి 3000 ర్యాంకు వరకు,
 మధ్యాహ్నం 12.30కు 3,001నుంచి 6,000 ర్యాంకు వరకు
  5న ఉదయం 9కి 6,001 నుంచి 9,000 ర్యాంకు వరకు,
 మధ్యాహ్నం 12.30కు 9,001నుంచి 1,2000 ర్యాంకు వరకు
  6న ఉదయం 9కి 12,001 నుంచి 15,000 ర్యాంకు వరకు,
 మధ్యాహ్నం 12.30కు 15,001నుంచి చివరి ర్యాంకు వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement