ఓటు హక్కు వినియోగంపై ఈసీ అవగాహన | EC Conduct Awareness Programme On Right To Vote | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగంపై ఈసీ అవగాహన

Oct 23 2018 11:52 AM | Updated on Oct 23 2018 12:22 PM

EC Conduct Awareness Programme On Right To Vote - Sakshi

ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమానికి హాజరైన అధికారులు, దివ్యాంగులు

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్ని వర్గాల వారికి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించింది. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో దివ్యాంగులకు, అంధులకు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. వారికి ప్రత్యేకంగా ఓటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, ర్యాంపులు, బ్రెయిలీ లిపి ద్వారా ఎలా ఓటింగ్‌ వినియోగించుకోవాలో వివరించారు. 

 ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్‌లపై అవగాహన కల్పించే పలు వాహనాలను అధికారులు ప్రారంభించారు. రెండో రోజు సమావేశానికి డీజీపీ మహేందర్‌ రెడ్డి, అడిషనల్‌ డీజీ జితేందర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement