విధులు సమర్థవంతంగా నిర్వహించాలి 

Do Your Election Duties Strictly - Sakshi

ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారులు కీలకపాత్ర వహించాలి   

నిర్మల్‌ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ప్రశాంతి 

నిర్మల్‌టౌన్‌: ఈ నెల 7న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఆదివారం రాత్రి ఎన్నికల ఏర్పాట్లపై సెక్టోరల్, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈవీఎం మిషన్లు పనిచేయకపోతే వెంటనే రిప్లేస్‌ చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులైన తాగునీరు, విద్యుత్, లైట్లు, ఫ్యాన్స్, టాయ్‌లెట్స్, కుర్చీలు, బెంచీలు తదితర వాటిని ముందుగానే పరిశీలించాలన్నారు. ఎన్నికల సందర్భంగా గంట గంటకు సమాచారం ఇవ్వాలన్నారు. గర్భిణులు క్యూలో నిలబడకుండా వారు నేరుగా ఓటింగ్‌కు వెళ్లేలా చూడాలన్నారు.
ప్రతీ సెక్టోరల్‌ అధికారి వద్ద వీవీ ప్యాట్‌–2, బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో పోలింగ్‌ రోజు బూత్‌ లెవల్‌ అధికారి అందుబాటులో ఉండాలన్నారు. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు, ప్రథమ చికిత్స బాక్స్‌తో ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో టెంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఓటింగ్‌ అసిస్టెంట్‌ నియమించాలన్నారు. వీల్‌ చైర్స్‌ ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సెక్టార్‌ అధికారుల విధులు తదితర విషయాలను వివరించారు.     మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
పోలింగ్‌ రోజు కేంద్రాల్లో సెల్‌ఫోన్‌ అనుమతి లేదన్నారు. పోలింగ్‌ రోజు ఓటింగ్‌ కోసం వెళ్లే ఓటర్లకు, అధికారులకు, సిబ్బందికి, ఏజెంట్లకు ఎవరికి కూడా సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శశిధర్‌రాజు, జేసీ భాస్కర్‌రావు, ఏఎస్పీ దక్షిణమూర్తి, ఆర్డీవో, ఆర్‌వోలు ప్రసూనాంబ, రాజు, వినోద్‌కుమార్, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top