చినుకు కునుకేసింది

Deficit Rainfall In This Year All Over Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జూలై చివర.. అంటే ఈ సమయానికి బాగా వానలు పడాల్సిన సమయం. జలాశయాలన్నీ కళకళలాడాల్సిన తరుణం.. కానీ నగరంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.. ఏదో పడీపడనట్లుగా.. కురిసీకురవనట్లుగా వర్షం.. దీంతో బోర్లు నోళ్లు తెరిచాయి.. భూగర్భ జలాలు అడుగంటాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నా.. సాధారణంగా పడాల్సిన దానితో పోలిస్తే.. అబ్బే.. ప్చ్‌ అనాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా జూన్‌ 1 నుంచి జూలై 24 వరకు నమోదుకావాల్సిన వర్షపాతం 240.3 మిల్లీమీటర్లు అయితే.. 153.1 మి.మీటర్లే నమోదైంది. అంటే సాధారణం కంటే 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top