‘డీసీ’ నిందితులకు బెయిల్ నిరాకరణ | court rejects bail for dc accused | Sakshi
Sakshi News home page

‘డీసీ’ నిందితులకు బెయిల్ నిరాకరణ

Mar 7 2015 1:23 AM | Updated on Sep 2 2017 10:24 PM

తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం పొంది మోసానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక రవిరెడ్డిలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం పొంది మోసానికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక రవిరెడ్డిలకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వీరిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి వై.వీర్రాజు కొట్టివేశారు. అనేక బ్యాంకుల నుంచి తప్పుడు పద్ధతుల్లో వీరు రుణాలు పొందారని, బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతుందన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement