తెలంగాణలో మరో కరోనా మరణం | Coronavirus : Death Rises To Ten In Telanagana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో కరోనా మరణం

Apr 3 2020 7:56 PM | Updated on Apr 3 2020 8:26 PM

Coronavirus : Death Rises To Ten In Telanagana - Sakshi

సాక్షి, రంగారెడ్డి/ హైదరాబాద్‌ : తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేగూర్‌ గ్రామానికి చెందిన 62 ఏళ్ల మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. కాగా మహిళ మృతి చెందిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 10 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌లు అప్రమత్తమై మహిళ సొంత గ్రామమైన చేగూర్‌ను పరిశీలించారు. అనంతరం మృతురాలి నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ మందును విస్తృతంగా స్ప్రే చేయించారు. కాగా చనిపోయిన మహిళకు కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఎవరెవరు ఉన్నారో గుర్తించి వారిని సిపార్డ్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలిన వారికి తమ ఇళ్లలోనే క్వారంటైన్‌ చేపట్టాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement