కరోనా: సింగరేణి 40 కోట్ల విరాళం | Corona: Singareni Donated RS 40 Crores To Telangana CMRF | Sakshi
Sakshi News home page

కరోనా: లలితా జ్యూవెల్లర్స్‌ కోటి విరాళం

May 6 2020 5:53 PM | Updated on May 6 2020 7:49 PM

Corona: Singareni Donated RS 40 Crores To Telangana CMRF - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండటం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. (7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు)

తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం లలితా జ్యువెల్లర్స్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును లలిత జ్యువెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళమిచ్చిన ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. (‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’ )

Advertisement
 
Advertisement
Advertisement