breaking news
Lalitha Jewellers
-
ఐపీవోకు లలితా జ్యువెలరీ
న్యూఢిల్లీ: బంగారు ఆభరణ వర్తక దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఎం.కిరణ్ కుమార్ జైన్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అర్హతగల సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్లో షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,015 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. 1985లో చెన్నైలోని టీనగర్లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్‌కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ కార్యకలాపాలున్నాయి. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల్లో రూ.12,595 కోట్ల ఆదాయం, రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యారు లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ కుమార్. తన బ్రాండ్‌కు తానే అంబాసిడర్‌గా వ్యవహరించి లలితా జ్యువెల్లరి ఆభరాలను ప్రమోట్ చేసుకున్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయి.. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన మహానటి సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఇంత పెద్ద సెక్సెస్ అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని తాజాగా ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. సావిత్రి ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించానని, ఆమె వల్లే తాను సక్సెస్ అయ్యానన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కాగా ఆయన చెన్నైలోని మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడ వ్యాపారం విస్తరించుకున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిగారి ఇంటితో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఎంతో ఇష్టంతో సావిత్రి గారి ఆస్తిని కొన్నానని కిరణ్ కుమార్ తెలిపారు. సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, అక్కడ షాప్ రెంట్‌కు తీసుకుని బంగారం షాప్ స్టార్ చేశానన్నారు. సావిత్రి గారి ఆశీర్వాదం వల్లే తన వ్యాపారం బాగా నడిచిందని, ఇప్పుడు తాను ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆ ఇంటి పేరు ఆమెదే ఉందన్నారు. ఆ బిల్డింగ్ లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము గానీ.. సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామన్నారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమ్మ ఆస్తి నుంచి వచ్చిన ఇల్లు అదేనని, దానిని పడగొట్టి ఓ కమర్షియల్ బిడ్డింగ్ కట్టామన్నారు. ‘దానిని లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ రెంట్‌కు తీసుకుని షాప్ పెట్టారు. ఆయనకు బాగా కలిసి వచ్చింది. దాంతో మేం దానిని అమ్మాలకున్నప్పుడు తనకే ఇవ్వాలని కోరాడు. అందుకే ఆయనకు ఆ బిల్డింగ్ అమ్మేసి ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కొనుక్కున్నాం’ అని చెప్పుకొచ్చారు. అనంతరం కిరణ్ కుమార్‌కే ఆ ఆస్తిని అమ్మడానికి ఓ కారణం ఉందని కూడా చెప్పారు. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ‘అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్‌ది బంగారం షాపే. అమ్మకు కార్ల పిచ్చి ఉన్నట్టే.. కిరణ్‌కి కూడా ఉంది. ‘‘అమ్మను ఆయన బాగా అభిమానిస్తారు. బిల్డింగ్ అమ్మిన తర్వాత ఎంట్రన్స్‌లో ఉన్న అమ్మ బొమ్మను తీసుకువెళ్తుంటే దానిని అక్కడే ఉంచాలని కోరాడు. ‘ఇది నేను కొన్నంత మాత్రానా ఈ ఆస్తి మీది కాకుండా పోదు. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్లండి. కానీ, సావిత్రి అమ్మ ఫొటో తీసుకు వెళ్లొద్దు’ అని కిరణ్ కోరాడు’ అని ఆమె చెప్పింది. అంతేకాదు తనని తమ్ముడిగా భావించమంటూ అక్కయ్య అని కిరణ్ అప్యాయంగా పిలుస్తారంటూ విజయ చాముండేశ్వరి తెలిపారు. -
కరోనా: సింగరేణి 40 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండటం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. (7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు) తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళం లలితా జ్యువెల్లర్స్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును లలిత జ్యువెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళమిచ్చిన ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. (‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’ ) -
మాయ‘లేడి’.. నగలు దోచే ‘కేడీ’
సాక్షి, హైదరాబాద్ : నగల దుకాణాలలో నకిలీ ఆభరణాలను పెట్టి అసలు ఆభరణాలతో ఉడాయిస్తోందో మహిళ. సిబ్బంది దృష్టి మళ్లించి ఈ దొంగతనాలకు పాల్పడుతూంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ గుర్తు తెలియని మహిళ పంజాగుట్టలోని మలబార్ గోల్ట్ నగల దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించి రూ.420 విలువ చేసే రోల్డుగోల్డు ఛైన్‌ను పెట్టి 36గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించింది. అదే విధంగా లలితా జువెలర్స్‌లో రూ.600 విలువ చేసే నకిలీ ఛైన్‌ను పెట్టి 28గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. నగలు నకిలీవని గుర్తించిన సిబ్బంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
లలితా జ్యువెల్లర్స్లో చోరీ
-
లలితా జ్యువెల్లర్స్లో చోరీ
సాక్షి, హైదరాబాద్ : 'డబ్బులు ఊరికే రావు' అనే మాటతో మార్కెట్లో తనకంటూ గుర్తింపు పొందిన లలితా జ్యువెల్లర్స్లో శనివారం చోరీ జరిగింది. ఈ మేరకు జ్యువెల్లర్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు దోచుకెళ్లినట్లు జ్యువెల్లర్స్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజిలో గుర్తించారు. రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ ప్రారంభించారు.