Mahanti Savithri-Lalitha Jewellers MD: ‘సావిత్రిగారి ఇల్లు నాకు సెంటిమెంట్‌, అందుకే..!’

Lalitha Jewellery Owner About Mahanati Savitri in Latest Interview - Sakshi

‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్‌ అయ్యారు లలితా జువెల్లర్స్‌ ఎండీ కిరణ్‌ కుమార్‌. తన బ్రాండ్‌కు తానే అంబాసిడర్‌గా వ్యవహరించి లలితా జ్యువెల్లరి ఆభరాలను ప్రమోట్‌ చేసుకున్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్‌ అయి.. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన మహానటి సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఇంత పెద్ద సెక్సెస్‌ అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని తాజాగా ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. సావిత్రి ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించానని, ఆమె వల్లే తాను సక్సెస్‌ అయ్యానన్నారు. 

చదవండి: యాంకర్‌ రష్మీ ఇంట తీవ్ర విషాదం

కాగా ఆయన చెన్నైలోని మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడ వ్యాపారం విస్తరించుకున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిగారి ఇంటితో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఎంతో ఇష్టంతో సావిత్రి గారి ఆస్తిని కొన్నానని కిరణ్ కుమార్ తెలిపారు. సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, అక్కడ షాప్‌ రెంట్‌కు తీసుకుని బంగారం షాప్‌ స్టార్‌ చేశానన్నారు. సావిత్రి గారి ఆశీర్వాదం వల్లే తన వ్యాపారం బాగా నడిచిందని, ఇప్పుడు తాను ఇంత పెద్ద సక్సెస్‌ అయ్యానని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆ ఇంటి పేరు ఆమెదే ఉందన్నారు. ఆ బిల్డింగ్‌ లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము గానీ.. సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామన్నారు.

అయితే ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమ్మ ఆస్తి నుంచి వచ్చిన ఇల్లు అదేనని, దానిని పడగొట్టి ఓ కమర్షియల్‌ బిడ్డింగ్‌ కట్టామన్నారు. ‘దానిని లలితా జువెల్లర్స్‌ ఎండీ కిరణ్‌ రెంట్‌కు తీసుకుని షాప్‌ పెట్టారు. ఆయనకు బాగా కలిసి వచ్చింది. దాంతో మేం దానిని అమ్మాలకున్నప్పుడు తనకే ఇవ్వాలని కోరాడు. అందుకే ఆయనకు ఆ బిల్డింగ్‌ అమ్మేసి ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కొనుక్కున్నాం’ అని చెప్పుకొచ్చారు. అనంతరం కిరణ్‌ కుమార్‌కే ఆ ఆస్తిని అమ్మడానికి ఓ కారణం ఉందని కూడా చెప్పారు. 

చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు

‘అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్‌ కుమార్‌ది బంగారం షాపే. అమ్మకు కార్ల పిచ్చి ఉన్నట్టే.. కిరణ్‌కి కూడా ఉంది. ‘‘అమ్మను ఆయన బాగా అభిమానిస్తారు. బిల్డింగ్‌ అమ్మిన తర్వాత ఎంట్రన్స్‌లో ఉన్న అమ్మ బొమ్మను తీసుకువెళ్తుంటే దానిని అక్కడే ఉంచాలని కోరాడు. ‘ఇది నేను కొన్నంత మాత్రానా ఈ ఆస్తి మీది కాకుండా పోదు. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్లండి. కానీ, సావిత్రి అమ్మ ఫొటో తీసుకు వెళ్లొద్దు’ అని కిరణ్‌ కోరాడు’ అని ఆమె చెప్పింది. అంతేకాదు తనని తమ్ముడిగా భావించమంటూ అక్కయ్య అని కిరణ్‌ అప్యాయంగా పిలుస్తారంటూ విజయ చాముండేశ్వరి తెలిపారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top