
ప్రతీకాత్మక చిత్రం
ఓ గుర్తు తెలియని మహిళ పంజాగుట్టలోని మలబార్ గోల్ట్ నగల దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించి రూ.420 విలువ చేసే రోల్డుగోల్డు ఛైన్‌ను పెట్టి...
సాక్షి, హైదరాబాద్ : నగల దుకాణాలలో నకిలీ ఆభరణాలను పెట్టి అసలు ఆభరణాలతో ఉడాయిస్తోందో మహిళ. సిబ్బంది దృష్టి మళ్లించి ఈ దొంగతనాలకు పాల్పడుతూంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ గుర్తు తెలియని మహిళ పంజాగుట్టలోని మలబార్ గోల్ట్ నగల దుకాణంలో సిబ్బంది దృష్టి మళ్లించి రూ.420 విలువ చేసే రోల్డుగోల్డు ఛైన్‌ను పెట్టి 36గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించింది. అదే విధంగా లలితా జువెలర్స్‌లో రూ.600 విలువ చేసే నకిలీ ఛైన్‌ను పెట్టి 28గ్రాముల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. నగలు నకిలీవని గుర్తించిన సిబ్బంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.