ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
మణుగూరు (ఖమ్మం) : ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వందల లీటర్లలో నాటుసారాను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.