విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు జోగు రామన్న..
మంచిర్యాల టౌన్ : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాల రాజీవ్‌నగర్‌లో సర్వశిక్ష అభియాన్ కింద రూ.1.25 కోట్లతో నిర్మించిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, బాలికల విద్యాలయంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జనవ రి నుంచి వసతిగృహాలతోపాటు బాలికల విద్యాలయం లో కూడా సన్న బియ్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు నియోజకవర్గానికి ఒక విద్యాలయాన్ని ప్రారంభించనుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ సుమన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, దుర్గం చిన్న య్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, ఉప విద్యాధికారి చారి, మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న, మున్సిపల్ ఇంజినీర్లు మసూద్‌అలీ, సంతోష్, పాఠశాల ప్రత్యేకాధికారి స్వప్న పాల్గొన్నారు.