ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి | Congress MLA DK Aruna Plans To Develop Gadwal | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి

Mar 25 2018 10:42 AM | Updated on Mar 18 2019 8:57 PM

Congress MLA DK Aruna Plans To Develop Gadwal - Sakshi

గద్వాల: కుంటవీధిలో భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే డీకే అరుణ

గద్వాల: ప్రజల దీర్ఘకాలి క ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృ ద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక 16వ వార్డు పరిధిలోని కుంటవీధిలో రూ. నాలుగు లక్షల ఏసీడీపీ నిధులతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం 14వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరైన రూ. ఐదు లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ జిల్లా కేంద్రం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కృష్ణవేణి, వార్డు కౌన్సిలర్‌ జయలక్ష్మి, టీపీసీసీఎం సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు బండల వెంకట్రాములు, భాస్కర్‌యాదవ్, నాగేందర్‌యాదవ్, సరళమ్మ, అన్వర్,  నెమలికంటి రామాంజి  పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి
గద్వాల క్రైం: ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శనివారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో నూతనంగా తాగునీటి బోరు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి తన సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యాక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కృష్ణవేణి రామాంజనేయులు, రాష్ట్ర పీసీసీ మెంబర్‌ గడ్డం కృష్ణరెడ్డి, నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.

మల్దకల్‌ (గద్వాల): మండలంలోని వివిధ అభివృద్ది పనులకు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే  అరుణ భూమి పూజ చేశారు. శనివారం మండలంలోని ఎల్కూర్,  బిజ్వారం ఉన్నత పాఠశాలలో సొంత నిధులతో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌లను ప్రారంభించారు. అదే విధంగా బిజ్వారం బీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, సత్యారెడ్డి, విక్రంసింహారెడ్డి, పాల్వాయి రాములు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement