కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమం  | Congress Leaders Campaign In Khammam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమం 

Nov 23 2018 5:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Leaders Campaign In Khammam - Sakshi

ప్రచారం నిర్వహిస్తున్న కూటమి నాయకులు 

సాక్షి,ఆళ్లపల్లి: కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమమని, పినపాకలో కూటమి అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు ఖాయమని కూటమి నాయకులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మహాకూటమి గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు నిలదీయాలని వారు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే కాంగ్రెస్‌ అని, కాంగ్రెస్‌తోనే సంక్షేమమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటువేసి రేగా కాంతారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పాయం నర్సింహరావు, రేసు ఎల్లయ్య, శ్రీనివాసచారి, పడిగ సమ్మయ్య, బుర్ర వెంకన్న, ఆదాం, ఆరీఫ్, వెంకన్న, ఖాలీద్, పరమేష్, ప్రశాంత్, రాజేష్, శివ, లక్ష్మయ్య, ఎన్‌.శివ, హరీష్, అగ్ని, మాణిక్యమ్మ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement