బండారు దత్తాత్రేయకు పలువురు సంతాపం

Condolences Pour In For Bandaru Dattatreya Son Vaishnav - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్రాత్తేయ కుమారుడు వైష్ణవ్‌ ఆకస్మిక మృతి పట్లు పలువురు సంతాపం తెలిపారు. గతరాత్రి వైష్ణవ్‌ గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ...‘దత్తాత్రేయ ఇంటికి ఎన్నో సందర్భాలలో వచ్చాను కానీ ఈ రోజు ఈ రకంగా ఆయనను కలవడం చాలా బాధాకరం. ప్రపంచంలో అతి పెద్ద దుఃఖం పుత్రశోకం. భగవంతుడు ఆయనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’ అని తెలిపారు. మరోవైపు  సినీనటుడు హరికృష్ణ...బండారు దత్తాత్రేయకు సంతాపం తెలిపారు. కాగా బండారు వైష్ణవ్‌ అంత్యక్రియలు సైదాబాద్‌లోని శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాంనగర్‌లోని స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top