మగశిశువు మృతిపై బాధితుల ఆందోళన | Concern for the victims of Male baby death | Sakshi
Sakshi News home page

మగశిశువు మృతిపై బాధితుల ఆందోళన

Jun 7 2016 1:47 AM | Updated on Sep 4 2017 1:50 AM

వైద్యుల నిరక్ష్యం వల్లే మగశిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు....

ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి  నిలదీత
ప్ పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

 
 అచ్చంపేట రూరల్ : వైద్యుల నిరక్ష్యం వల్లే మగశిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.  వివరాలిలా ఉన్నాయి. ఈనెల 3వ తేదీ సాయంత్రం ఉప్పునుంతలకు చెందిన కళావతికి పురిటినొప్పులు రావడంతో భర్త కృష్ణయ్య అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు ఆపరేషన్ చేసి మగశిశువును బయటకు తీసి తల్లికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిని చూడాలని పక్కనే ఉన్న చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రామకృష్ణకు సూచించారు. అదేరోజు పట్టణంలోని ఎంఎంఆర్ ప్రైవేట్ ఆస్పత్రిలో మగశిశువును చేర్చుకుని పరీక్షించిన తర్వాత హైదరాబాద్‌లోని నిలోఫర్ కు తరలించారు.

చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మగశిశువు మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన బాధితులు సాయంత్రం ఇక్కడి ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి కొద్దిసేపు ఆందోళనకు దిగారు. శిశువు ఆరోగ్య పరిస్థితి తెలపకముందే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేశారని డాక్టర్ రామకృష్ణను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మంగళవారం ఎస్పీహెచ్‌ఓతో మాట్లాడి న్యాయం చేస్తామడంతో వారు శాంతించి వెనుదిరిగారు. ఈ విషయమై డాక్టర్ రామకృష్ణను వివరణ కోరగా మగశిశువును పరీక్షించిన వెంటనే మెరుగైన వైద్యంకోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించామన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement