నా పరిస్థితి ఏమిటి? | Companies Forcing Students Selected For Campus Placements Are Fired By UGC | Sakshi
Sakshi News home page

కొలువొచ్చినా పట్టా రాలేదు!

Jul 22 2020 1:12 AM | Updated on Jul 22 2020 8:08 AM

Companies Forcing Students Selected For Campus Placements Are Fired By UGC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా కొలువులకు ఎంపిౖకైన 14 వేల మంది ఇంజనీరింగ్‌ కాలేజీల ఫైనలియర్‌ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీరుతో ఉసూరు మంటున్నారు. కరోనా మహ మ్మారి విజృంభణతో ఓవైపు లక్ష లాది మంది ఉపాధి కోల్పోతున్న వేళ అందివచ్చిన ఉద్యోగాల్లో చేరేందుకు డిగ్రీ పట్టా లేకపోవ డం అడ్డంకిగా మారడంతో ఆవే దన చెందుతున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్‌ పిలానీ, డీమ్డ్‌ వర్సిటీల్లో చదివి క్యాంపస్‌ కొలువులకు ఎంపికైన బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి పోగా యూజీసీ పరిధిలోని ఇంజ నీరింగ్‌ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మాత్రం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పొందినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించా లంటూ ఉద్యోగాలిచ్చిన కంపెనీలు పంపుతున్న లేఖలకు బదులివ్వలేక తలపట్టుకుంటున్నారు.

యూజీసీకి ఎందుకీ మొండిపట్టు..
కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, డీమ్డ్‌ వర్సిటీలు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు సర్టిఫి కెట్లు ఇచ్చేశాయి. కొన్ని కాలేజీలు అయితే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇచ్చి విద్యా ర్థులను ప్రమోట్‌ చేసి పాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చేశాయి. మరోవైపు కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధి లోని ఇంజనీరింగ్‌ కాలేజీల ఫైనలియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే యూజీసీ వైఖరిని తప్పుపడుతూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాశాయి. యూజీసీ నిర్ణయం అసం బద్ధమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభు త్వాలు మాత్రం వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వ హిస్తామని ప్రకటిం చాయి. కానీ కరోనా ఉధృతమైతే పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, తమకు వచ్చిన ఉద్యోగాలు పోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

స్పష్టత కరువు...
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇంటర్నల్‌ మార్కులు లేదా ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిపోయేవారని, యూజీసీ మొండి పట్టుదల కారణంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ వ్యాఖ్యానించారు. ‘ఎన్‌ఐటీలు నామమాత్రంగా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాయి. డీమ్డ్‌ వర్సిటీలు ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేశాయి. వాళ్లకు లేని నిబంధన ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఎందుకు? ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై స్పష్టత లేదు.

కరోనా తగ్గుముఖం పడితే గానీ సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహించాక వ్యాల్యుయేషన్, ట్యాబులేషన్‌ వంటి వాటికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా విద్యార్థుల ఉద్యోగాలకు యూజీసీ గ్యారంటీ ఇస్తుందా? అని ఆ ప్రిన్సిపల్‌ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం కేలండర్‌ విషయంలో యూజీసీ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ‘ఫైనలియర్‌ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉంటాయి. అప్పటికే వారు ఏడు సెమిస్టర్‌లలో 35–40 సబ్జెకుŠట్‌లు చదివి పాసైన వారే. నా ఉద్దేశంలో ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా వారిని పాస్‌ చేయవచ్చు’ అని మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ అభిప్రాయపడ్డారు.

నా పరిస్థితి ఏమిటి?
‘నన్ను ఓ కార్పొరేట్‌ కంపెనీ రూ. 28 లక్షల వార్షిక వేతనానికి నియమించుకుంది. డిగ్రీ సర్టిఫికెట్‌ కాపీలు పంపాలని ఇప్పటికే పలుమార్లు మెయిల్‌ పంపింది. తాజాగా అక్టోబర్‌ 31 వరకు డెడ్‌లైన్‌ పెట్టింది. అప్పటికీ నా చేతికి సర్టిఫికెట్‌ రాకపోతే నేను మళ్లీ ఆ ఉద్యోగం సాధిస్తానా? కరోనా నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు నిద్రపట్టట్లేదు’ అని ఓ ప్రతిష్టాత్మక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన ఫైనలియర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. యీజీసీ ఇప్పటికైనా పరీక్షల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయాలని లేకుంటే పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమై విద్యార్థులు నస్టపోతారని ఓ ప్రైవేట్‌ కాలేజీ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement