డ్రైవింగ్‌ సీట్లోనే బస్సు డ్రైవర్‌ మృతి | college bus driver dies of fits in hyderabad while driving his bus | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ సీట్లోనే బస్సు డ్రైవర్‌ మృతి

Mar 3 2017 10:53 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు డ్రైవర్‌ డ్రైవింగ్‌ సీట్లోనే మృతి చెందాడు.

హైదరాబాద్‌: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు డ్రైవర్‌ డ్రైవింగ్‌ సీట్లోనే మృతిచెందాడు. బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు శుక్రవారం ఉదయం విద్యార్థులను తీసుకొని కళాశాలకు వెళ్తుండగా.. నారాయణగూడ చౌరస్తా వద్దకు రాగానే బస్సులో డీజిల్‌ అయిపోయింది.
 
బస్సులో ఉన్న కళాశాల ఫ్యాకల్టీ డీజిల్‌ తేవడానికి వెళ్లిన సమయంలో బస్సు డ్రైవర్‌ రసూల్‌కు ఫిట్స్‌ రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. రసూల్‌ గత రెండు రోజులగా మాత్రమే డ్రైవింగ్‌ చేస్తున్నాడని.. పర్మనెంట్‌ డ్రైవర్‌ అందుబాటులో లేకపోవడంతో.. దినసరి కూలి లెక్కన బస్సు నడపడానికి వచ్చాడని కాలేజి యాజమాన్యం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement