కేసీఆర్‌ పర్యటనలో స్వల్ప మార్పు

షెడ్యూల్‌లో లేని ఎన్టీపీసీ పరిశీలన

కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల సందర్శనలో స్వల్ప మార్పు జరిగింది. రెండో రోజు ప్రాజెక్టుల సందర్శనకు రామగుండం నుంచి బయలుదేరిన కేసీఆర్‌ తన పర్యటన షెడ్యూల్‌లో లేని రామగుండం ఎన్టీపీసీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న1600 మెగావాట్ల తెలంగాణ విద్యుత్‌ కర్మాగారం పనులను పరిశీలించారు. ధర్మారం  మండలం నందిమేడారం చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ పంప్‌హౌజ్‌ పనులు, అండర్‌ టన్నెల్‌ పనులను కూడా ఆయన పరిశీలించారు.

Back to Top