హామీలను మరిచిన కేసీఆర్‌

CM KCR Forgot Promises Said Former Minister DK Aruna - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఎన్నికల ముందు రైతులకు, ప్రజలకు ఇచ్చిన హమీలను సీఎం కేసీఆర్‌ మరిచారని..వెంటనే వాటిని నెరవేర్చాలని మాజీ మంత్రి. డి.కే.అరుణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తక్షణ తలాక్‌ నిషేద బిల్లును రాజ్యసభలో అమోదించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. తక్షణ తలాక్‌ నిషేద బిల్లు వల్ల మహిళలకు ప్రధాని నరేంద్రమోడీ అండగా నిలిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా చేపట్టడం జరుగుతుంది.

టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనతో బిజేపిలోకి స్వచ్ఛందంగా పలువురు చేరుతున్నారని వాపోయారు. రైతుబంధు, రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చని కేసీఆర్‌..మున్సిపాలిటీ ఎన్నికల ముందు పింఛన్ల ప్రోసిడింగ్‌తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొత్త పింఛన్లు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదనిన్నారు. 

నిరుద్యోగ భృతి ఏమైంది?
నిరుద్యోగులకు రూ.3116 నిరుద్యోగ భృతి ఏమైందని, దివ్యాంగులకు పింఛన్లు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వ హయంలో 4విడతలుగా రుణమాఫీ చేస్తే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు రుణమాఫీపై ఊసెత్తడం లేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడం వల్ల కూలిపోతున్నాయని, ఇప్పటికే చాలా వరకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా అభివృద్ధిచేయాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి మూడేళ్లలో చేస్తామని చెప్పి..ఆరేళ్లు కావస్తుందన్నారు.

ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం తక్షణ తలాక్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించడం పట్ల మైనార్టీ మహిళలు డికే.అరుణకు స్వీట్లు తినిపించి, హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు కుమారస్వామి, రఘు, అనుజ్ఞరెడ్డి, ప్రవీన్, మురార్జీ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top