సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ పూర్తి
సీఎం కేసీఆర్‌కు బుధవారం డాక్టర్ సచ్‌దేవ్ నేతృత్వంలోని వైద్యుల బృందం కంటి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుధవారం డాక్టర్ సచ్‌దేవ్ నేతృత్వంలోని వైద్యుల బృందం కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని సీఎం తనయుడు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రి కుడి కన్నులోని కాట్రాక్ట్ ఆపరేషన్ విజయవంతమైంది. డాక్టర్ సచ్‌దేవ్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఆపరేషన్ కోసం సీఎం గత శుక్రవారం( సెప్టెంబర్ 1న) ఢిల్లీకి వెళ్లారు. శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో వైద్యులు ఆపరేషన్‌కు కావల్సిన చికిత్సలు పూర్తి చేశారు.