
పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు
సీఎం మాజీ చీఫ్ సెక్యూరిటీ అధికారి కోదాటి సురేశ్ రావు అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో ఆదివారం పోలీస్ లాంఛనాలతో నిర్వహించారు.
ఎల్కతుర్తి: సీఎం మాజీ చీఫ్ సెక్యూరిటీ అధికారి కోదాటి సురేశ్ రావు అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో ఆదివారం పోలీస్ లాంఛనాలతో నిర్వహించారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేసిన ఆయన శుక్రవారం డ్యూటీలోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడి సోదరుడు సుధీర్‌రావు కెనడా నుంచి వచ్చే వరకు అంత్యక్రియలు ఆపారు.
అంత్యక్రియలకు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ మహేశ్ భగవత్, జిల్లా ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బారాయుడు తదితరులు హాజరై నివాళులర్పించారు. సురేశ్‌రావు ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు, బంధువులు ఎంపీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.