ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి 

Chiranjeevi And Ram Charan Teja Attended For Umapathi Rao Funeral - Sakshi

అంతిమయాత్రలో తేనెటీగల దాడి

దోమకొండ: దోమకొండ సంస్థాన వారసుడు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు(92) అంత్యక్రియలను ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండలోని లక్ష్మీబాగ్‌లో నిర్వహించారు. ఆయన మే 27న హైదరాబాద్‌లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్, ఇతర కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు పాడెను మోశారు. ఉమాపతిరావు కుమారుడు, చిరంజీవి వియ్యంకుడు అయిన అనిల్‌కుమార్‌ చితికి నిప్పు పెట్టారు.  దోమకొండ కోట నుంచి ఉమాపతిరావు భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం తరలించే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు అక్కడున్నవారిని చుట్టుముట్టాయి. చిరంజీవి ఉన్న ప్రాంతానికి తేనెటీగలు రావడాన్ని గమనించిన ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై టవల్‌తో వాటిని పారదోలుతూ ఆయనను అక్కడి నుంచి లోపలకు తీసుకువెళ్లారు. మిగతావారు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. 

పాడె మోస్తున్న చిరంజీవి, రాంచరణ్‌ తేజ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top