ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టాయి. ఖమ్మం జిల్లా చండ్రుగొండలో ఉపాధి హామీ పథకంలోగోల్మాల్ జరిగింది.
ఖమ్మం : ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టాయి. ఖమ్మం జిల్లా చండ్రుగొండలో ఉపాధి హామీ పథకంలోగోల్మాల్ జరిగింది. చెక్కు ఫోర్జరీ చేసి కొత్తగూడెం ఎస్బీహెచ్లో రూ.4.50 లక్షలు డ్రా చేశారు. ఉపాధి హామీ ఉద్యోగుల ఫిర్యాదుతో బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.