ఈఅండ్‌ఎం ధరల పెంపులో మోసం | cheating of the price increase in e&m | Sakshi
Sakshi News home page

ఈఅండ్‌ఎం ధరల పెంపులో మోసం

Dec 12 2017 3:03 AM | Updated on Oct 19 2018 7:27 PM

 cheating of the price increase in e&m - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఐఎస్‌) ఎలక్ట్రో మెకానికల్‌ (ఈఅండ్‌ఎం) పరికరాల ధరలను పెంచడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఇస్కీ) ఇచ్చిన ధరలను పక్కన పెట్టి డిపార్ట్‌మెంటల్‌ కమిటీ సలహాదారు చెప్పిన ప్రకారం ఈఅండ్‌ఎం పరికరాల ధరను మోసపూరితంగా పెంచారని, దీనివల్ల ఖజానాకు రూ.2,426 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, దీనిపై దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

అలాగే 1,5,8,16 ప్యాకేజీలకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ కూడా రద్దు చేయాలని.. పంపులు, మోటార్లతో పాటు ఈఅండ్‌ఎం పరికరాలకు ఎటువంటి మొత్తాలను విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. జనార్దన్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని పార్టీ ఇన్‌ పర్సన్‌గా దాఖలు చేశారు. న్యాయవాదితో నిమిత్తం లేకుండా ఆయనే స్వయంగా వాదనలు వినిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement