మహబూబ్‌నగర్‌ ఆస‍్పతిలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం | Chatanpally Encounter: NHRC team Visits Mahabubnagar district hospital | Sakshi
Sakshi News home page

మృతదేహాలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

Dec 7 2019 1:54 PM | Updated on Dec 7 2019 2:02 PM

Chatanpally Encounter: NHRC team Visits Mahabubnagar district hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. నలుగురు సభ్యుల ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకుంది. ముందుగా ఈ బృందం ఎన్‌కౌంటర్‌కు గురైన నిందితుల మృతదేహాలను .. మృతుల తల్లిదండ్రులు, వారి తరఫున వైద్యుల సమక్షంలో పరిశీలించింది. మృతుల తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. అనంతరం చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనుంది. 

కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై తమకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేంతవరకూ మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించరాదంటూ జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీ రూమ్‌లో భద్రపరిచారు. 

చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement