'చంద్రబాబు ఒప్పుకున్నట్టే భావిస్తున్నాం' | chandra babu role in tdp bribe episode, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ఒప్పుకున్నట్టే భావిస్తున్నాం'

Jun 4 2015 12:24 PM | Updated on Aug 10 2018 9:23 PM

'చంద్రబాబు ఒప్పుకున్నట్టే భావిస్తున్నాం' - Sakshi

'చంద్రబాబు ఒప్పుకున్నట్టే భావిస్తున్నాం'

'ఓటుకు నోటు' వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందని భావిస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

హైదరాబాద్: 'ఓటుకు నోటు' వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందని భావిస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ముడుపుల వ్యవహారం సాగించానని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి సంభాషణల్లోమూడు సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందన్నారు. ఈ బాగోతంపై చంద్రబాబు ఇవాళ్టి వరకు నోరు విప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన దానితో తనకు సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు.

స్టీఫెన్ సన్ తో తాను ఫోన్ లో మాట్లాడినట్టు వచ్చిన ఆరోపణలను చంద్రబాబు ఖండించకపోవడంతో ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉందని ఒప్పుకున్నట్టేనని కడియం శ్రీహరి అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అన్ని వివరాలు సంభాషణలు బయటకు వస్తాయన్నారు. తప్పు ఒప్పుకోకుండా కుట్రపన్ని తనను ఇరికించారని రేవంత్ రెడ్డి ఆరోపించడం శోచనీయమన్నారు. కడియం శ్రీహరి గురువారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement