ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు.
కామారెడ్డి: ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. అశోక్ నరగ్ కాలనీకి చెందిన అనురాధ(38) ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని ఐదుతులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.