పసుపు బోర్డుపై స్పందించిన కేంద్రం | Sakshi
Sakshi News home page

పసుపు బోర్డుపై స్పందించిన కేంద్రం

Published Fri, Mar 2 2018 6:51 PM

Central Minister Responded On Minister Ktr Letter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు రాసిన లేఖకు కేంద్ర మంత్రి స్పందించారు. స్పైసెస్‌ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోరకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు హామీ ఇచ్చారు. పసుపు పంట మార్కెటింగ్‌ రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని సురేష్‌ ప్రభు అన్నారు. స్పైసెస్‌ బోర్డు పసుపుతో పాటు ఇతర ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెలల్‌ను స్పైసెస్‌ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ ఎక్స్‌పోర్ట్‌ స్కీం పథకం కింద ప్రత్యేకంగా ఓస్పైసెస్‌ పార్క్‌ను కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement